NBK107 Teaser: నరకడం మొదలుపెడితే ఏ పార్ట్‌ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు.. అదుర్స్‌ అనిపించిన బాలయ్య

9 Jun, 2022 18:31 IST|Sakshi

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే కదా! శ్రుతి హాసన్‌ కథానాయికగా కనిపించనున్న ఈ మూవీలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. గురువారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ హంట్‌ టీజర్‌ రిలీజ్‌ చేశారు.

'మీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌.. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌, భయం నా బయోడేటాలోనే లేదు, నరకడం మొదలుపెడితే ఏ పార్ట్‌ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలీదు నా కొడకల్లారా..' అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో  అదరగొట్టాడు బాలయ్య. నెరిసిన గడ్డం, కొత్త హెయిర్‌ స్టైల్‌తో అదుర్స్‌ అనిపించాడు. కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చొని స్టైలిష్‌గా చుట్ట తాగుతూ కనిపించాడు.

అఖండ తర్వాత రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మాస్‌ మూవీకి జై బాలయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

చదవండి: పూజా హెగ్డేకు ఘోర అవమానం
బిగ్‌బాస్‌లోకి హర్షసాయి? క్లారిటీ ఇచ్చిన యూట్యూబర్‌!

మరిన్ని వార్తలు