Nandamuri Balakrishna : ‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై స్పందించిన బాలయ్య

26 Jan, 2023 14:20 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుని కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదన్నారు. వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో యాదృచ్చికంగా ఆ మాట వచ్చిందన్నారు. హిందూపురంలో జరిగిన ఆ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు నాన్నగారు(ఎన్టీఆర్‌), అక్కినేని నాగేశ్వరరావు . నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ నేర్చుకున్నాను. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు కు ఇచ్చాం. బాబాయి(నాగేశ్వరరావు) పై ప్రేమ గుండెల్లో ఉంటుంది. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను. ఫ్లోలో  వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు’ అని బాలకృష్ణ అన్నారు. 

కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్‌ మీట్‌లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అని బాలకృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. 

మరిన్ని వార్తలు