‘ఆహా’ కోసం బాలయ్య కొత్త అవతారం.. న్యూ లుక్‌ పిక్స్‌ వైరల్‌

14 Mar, 2023 13:41 IST|Sakshi

నందమూరి నట సింహా బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నాడు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు  యాడ్స్‌.. యాంకరింగ్‌ చేస్తూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే  ఆయన హోస్ట్‌గా చేసిన టాక్‌ షో ‘అన్‌ స్టాపబుల్‌’ సూపర్‌ హిట్‌ అయింది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ టాక్‌ షోతో బాలయ్య క్రేజ్‌ మరింత పెరిగింది. ఇక ఇదే జోష్‌తో మరోసారి ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు ఈ నందమూరి నటసింహం. ఆహాలో స్ట్రీమింగ్‌ కాబోతున్నమ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్‌ ఐడల్‌ రెండో సీజన్‌లో బాలయ్య గెస్ట్‌గా మెరవబోతున్నాడు. 

ఇప్పటికే ఈ కాంపిటీషన్‌ షో కోసం 12 మంది కంటెస్టెంట్స్‌ని  ఫైనల్‌ చేశారు. ఈ 12 మందిని పరిచయం చేస్తూ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ లైవ్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను  ఆహా ట్వీట్‌ చేసింది.. గతంలో ఇంతకు ముందెన్నపుడు చూడని బాలయ్యను చూస్తారంటూ ట్వీటర్‌లో పేర్కొంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన న్యూ లుక్స్‌ పిక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు