Prabhas Promo: పెళ్లిపై ప్రభాస్ క్రేజీ ఆన్సర్.. బాలయ్యతో ప్రభాస్ ప్రోమో అదుర్స్

17 Dec, 2022 18:50 IST|Sakshi

రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రోమో వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్-2 సీజన్‌లో రెబల్ స్టార్‌ ప్రభాస్ గెస్ట్‌గా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఆ షోలో ఆయనతో పాటు మరో హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలయ్య షోకు ప్రభాస్‌ రావడంతో ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రోమోలో ఇద్దరి మధ్య సాగిన సంభాషణ తెగ నవ్వులు తెప్పిస్తోంది. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు రెబల్ స్టార్ నవ్వుతూ సమాధానాలిచ్చారు. వర్షం సినిమాలో విలన్ పాత్రలో నటించిన గోపీచంద్, హీరో ప్రభాస్ సంభాషణ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌ చేయనుంది. కాగా.. ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఈనెల 30న ఆహాలో ప్రసారం కానుంది. 

ప్రోమో విషయానికొస్తే.. 'బాలకృష్ణ మంత్రంతో ఈ ప్రోమో ప్రారంభం అయింది.  ఆ తర్వాత బాలకృష్ణ నన్ను కూడా డార్లింగ్ పిలవాలి అనడంతో సరే డార్లింగ్ సార్ అంటూ నవ్వులు పూయించారు. ఆ తర్వాత రామ్ చరణ్‌కు ఫోన్ చేసిన సంభాషణ తెగ ఆకట్టుకుంటోంది.  నీ లైఫ్‌లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటీ? అని బాలయ్య ప్రశ్నించారు. ఆ తర్వాత బెస్ట్‌ ఫ్రెండ్‌ గోపీచంద్‌తో కలిసి రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ను బాలయ్య ఆట పట్టించారు. చివరగా ప్రభాస్ ఫేమస్ డైలాగ్..' ఏండేయ్ ఏమైనా మాట్లాడండి.. ఓ పాట పాడండి.' చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్ హాజరు కావడంతో ఫుల్ ఎపిసోడ్‌ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

మరిన్ని వార్తలు