అల్లరి గతం.. పేరు మార్చేయ్‌...!

1 Mar, 2021 08:33 IST|Sakshi

అల్లరి నరేష్‌పై నాని ప్రశంసలు

హిట్‌ టాక్‌తో ‘నాంది’

సాక్షి,హైదరాబాద్‌ :  నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో అల్లరి నరేష్‌ని టాలీవుడ్‌ నేచురల్‌ స్టార్‌ నానీ పొగడ‍్తల్లో ముంచెత్తారు. భవిష్యత్తంతా బంగారుబాటే అన్న సంకేతాలిస్తూ..  నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ.. ”మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్‌ రేయ్‌ రేయ్‌.. ‘అల్లరి నరేష్‌’ పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను..” అని నాని పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.    (ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్‌ ఎమోషనల్‌)

కాగా  గమ్యం సినిమాలోని గాలి శ్రీను క్యారెక్టర్‌తో  తన నటనను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన అల్లరి నరేష్‌ తాజా చిత్రం నాంది.  ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే  హీరో నాని చేసిన  ట్వీట్ ఇపుడు  వైరల్‌గా మారింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు