స్పీడు పెంచిన 'ఏక్ మినీ కథ' హీరో.. ఆ డైరెక్టర్‌తో నెక్స్ట్‌ సినిమా!

2 Jun, 2021 12:15 IST|Sakshi

'ఏక్ మినీ కథ' సినిమాతో క్రేజ్‌ సంపాదించుకున్న కుర్ర హీరో సంతోష్‌ శోభన్‌. ప్రస్తుతం ఈయనకు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు  సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నందిని రెడ్డి సినిమాలో ఛాన్స్‌ కొట్టేసినట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఓ బేబీతో హిట్‌ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఇవి కాకుండా వైజయంతీ మూవీస్ బ్యానర్‌, గీతా అర్ట్స్‌ బ్యానర్‌లోనూ సినిమాలు చేసేందుకు నందినీరెడ్డి సైన్‌ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం నాగచైతన్య  ‘థ్యాంక్యూ’, లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలతో  సినిమాలతో బిజీగా ఉన్నారని, ఇవి పూర్తయ్యాకే నందినీ రెడ్డితో మూవీ ఉండనున్నట్లు సమాచారం. దీంతో ఈ గ్యాప్‌లో హీరో సంతోష్‌ శోభన్‌కు నందినీ కథ చెప్పినట్లు సమాచారం. 'తను నేను' .. 'పేపర్ బాయ్' సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్‌ శోభన్‌ రీసెంట్‌గా 'ఏక్ మినీ కథ'తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఈ యంగ్‌ హీరోతోనే నందినీ రెడ్డి తర్వాతి సినిమా ఉండనుందని, త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు సమాచారం. 

చదవండి : ‘ఏక్‌ మినీ కథ’ హీరోకు లక్కీ ఛాన్స్‌.. అదే బ్యానర్‌లో మరో 3 సినిమాలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు