'అక్షర' ట్రైలర్‌ వచ్చేసింది..

16 Feb, 2021 18:17 IST|Sakshi

"విద్యను నమ్మినవాడు విజ్ఞాని అవుతాడు, విద్యను అమ్మినవాడు జ్ఞానాగ్నిలో దహించుకుపోతాడు, అఖిల విశ్వాన్ని శాసించేది అక్షరమే.." అని ఎలుగెత్తి చాటుతున్న వాక్యాలతో అక్షర ట్రైలర్‌ ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్‌ నందిత శ్వేత ఫిజిక్‌ టీచర్‌ అక్షర, అన్యాయాన్ని ఎదిరించే వనితగా కనిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో విద్యను వ్యాపారం చేసిన కాలేజీల నిర్వాకాన్ని, సీట్లు, ర్యాంకుల అమ్మకాలను విమర్శిస్తూ విద్యార్థుల మానసిక ఒత్తిడిని తెర మీద చూపించేందుకు అక్షర చిత్రయూనిట్‌ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అక్షర ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్‌ చేశాడు. ఇక బడా కాలేజీలో చదివే ఓ విద్యార్థి మరణం చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. భూమిని నమ్ముకున్నోడు రైతు, చదువును నమ్ముకున్నోడు రాజు అని చెప్పిన డైలాగు బాగుంది. ఇందులో షకలక శంకర్‌, సత్య, అజయ్‌ ఘోష్‌, మధునందన్‌, కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సినిమా హాల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సురేశ్‌ వర్మ, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.

చదవండి: రఘుబాబు కూతురి ఎంగేజ్‌మెంట్‌లో స్టార్ల సందడి

హైదరాబాద్‌ నా సిటీనే.. నా బ్యూటీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు