Nandita Swetha On Her Fibromyalgia Disorder: నాలుగేళ్లుగా వ్యాధి.. అలాంటివీ చేయకూడదు: నందితా

16 Jul, 2023 04:45 IST|Sakshi

– నందితా శ్వేత

‘‘స్టార్‌డమ్‌ అనేది నా చేతుల్లో లేదు. నాకు వచ్చిన పాత్రలకు న్యాయం చేయడంపైనే దృష్టి పెట్టాను. వైవిధ్యమైన పాత్రలు చేశాను. ‘హిడింబ’తో నాకు స్టార్‌డమ్‌ ఖాయం అనే నమ్మకం ఉంది’’ అన్నారు నందితా శ్వేత. అశ్విన్‌బాబు హీరోగా అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్‌ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.

(ఇది చదవండి: రెండో భర్త మరణం.. 23 ఏళ్లకే జీవితం ముగిసిపోయింది: నటి)

ఈ సందర్భంగా హీరోయిన్‌ నందితా శ్వేత మాట్లాడుతూ ‘‘హిడింబ’లో ఆద్యా అనే పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటుంది. ఇక దాదాపు నాలుగేళ్లుగా కండరాలకు సంబంధించిన ఫైబ్రోమాల్జియాతో ఇబ్బంది పడుతున్నాను. దీనివల్ల భారీగా కసరత్తులు, డైట్‌ చేయకూడదు. నిద్రలేమి ఉండకూడదు. కానీ ‘హిడింబ’ కోసం ఇవన్నీ జరిగాయి. ఆ విధంగా కొంత స్ట్రగుల్‌ అయ్యాను. నేను చేసిన ‘మంగళవారం’ , ఓ మంచి ఘోస్ట్‌’ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. తెలుగులో ఒకటి, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను’’ అని అన్నారు.

(ఇది చదవండి: అందుకే సినిమాలకు దూరమయ్యా..: తమ్ముడు హీరోయిన్‌)

మరిన్ని వార్తలు