డిఫరెంట్ ప్రేమకథతో 'అగ్లీ స్టోరీ'.. గ్లింప్స్ రిలీజ్

25 Dec, 2023 15:09 IST|Sakshi

లక్కీ మీడియా, రియా జియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'అగ్లీ స్టోరీ'. నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లు నటించారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. గ్లింప్స్ చివరలో హీరో నందు చెప్పిన.. ఇమేజినేషన్‌లో ఉన్న ప్రేమ.. రియల్ లైఫ్‌లో ఉండదు అనే డైలాగ్ ఆసక్తి రేపుతోంది. 

(ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?)

అయితే ఈ గ్లింప్స్ మంచి స్పందన వస్తుండటంతో.. ముందు ముందు టీజర్, ట్రైలర్ మరియు సినిమాని మరింత కొత్తగా, ఆకట్టుకునే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నామని చెప్పారు. త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్)

>
మరిన్ని వార్తలు