యుద్దంలో కాళ్లు కోల్పోయిన సైనికుడి బయోపిక్‌లో నాని!

12 Jul, 2021 18:16 IST|Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని-గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జర్సీ’ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ రూపొందనునున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దీనిని నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఓ రియల్‌ హీరో జీవిత కథ ఆధారంగా బయోపిక్‌కు డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి ప్లాన్‌ చేస్తున్నాడట.

యుద్దంలో కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి నిజ జీవిత చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ రూపొందనుందట. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ బయోపిక్‌ను డైరెక్టర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు వినికిడి. అంతేగాక దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ను కూడా ప్రారంభించినట్లు సిని వర్గాల నుంచి సమాచారం. కాగా ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ‘టక్‌ జగదీశ్‌, శ్యామ్‌ సింగరాయ, అంటే సుందరానికి’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్‌ పూర్తి కాగానే గౌతమ్‌ తిన్ననూరితో ఈ బయోపిక్‌ ప్రారంభించేందుకు నాని ప్లాన్‌ చేస్తున్నాడట. 

మరిన్ని వార్తలు