ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల కోసం ‘దారే లేదా’ అంటున్న నాని

18 Jun, 2021 21:16 IST|Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు యంగ్‌ హీరో సత్యదేవ్‌. తాజాగా ఈ బ్లఫ్‌మాస్టర్‌ నటిస్తున్న చిత్రంలో‘దారే లేదా’ అనే పాట విడుదల అయ్యింది. ఈ పాటను కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు అండగా ఉంటూ, వారికి సేవలు అందించిన కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్ కు ఈ ‘దారే లేదా’ స్పెషల్‌ సాంగ్‌ను అంకితం ఇస్తున్నట్లు నేచురల్ స్టార్‌ నాని తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఈ సాంగ్‌ను విడుదల చేశారు.

నాని స్వీయ నిర్మాణసంస్థ వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ పతాకంపై ఈ మ్యూజిక్‌ వీడియోను సమర్పిస్తున్నారు. విజయ్‌ బులగానిన్‌ ‘దారే లేదా’ పాటకు సంగీతం అందించారు. ఈ స్పూర్తి దాయకమైన పాటకు కేకే లిరిక్స్‌ అందించారు. నాని, సత్యదేవ్‌లతో పాటు రూప కడువయుర్‌ కూడా ఈ ‘దారే లేదా’ పాటలో అసోసియేట్‌ అయ్యారు. ఈ నెల 18న సాయంత్రం 4గంటల 32 నిమిషాలకు ఈ సాంగ్‌ విడుదల చేశారు.

చదవండి: రూ. 4.65 కోట్ల ప్రైజ్‌ మనీ గెలుచుకున్న బ్రహ్మాజీ!.. ట్వీట్‌ వైరల్‌

    

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు