రెండో హిట్‌ కేసు ఆరంభం

21 Mar, 2021 02:20 IST|Sakshi

నాని ఓ వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు సొంత బ్యానర్‌ వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై చిత్రాలు నిర్మిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేనితో కలిసి ‘అ!’, ‘హిట్‌’ చిత్రాలు నిర్మించిన ఆయన తాజాగా ‘హిట్‌ 2’ సినిమాకు శ్రీకారం చుట్టారు. అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నారు. ‘హిట్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే ‘హిట్‌ 2’ (ది సెకండ్‌ కేస్‌ అన్నది ట్యాగ్‌లైన్‌ ) సినిమా రూపొందనుంది. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించనున్న ఈ సినిమా శనివారం ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి ప్రశాంతి కెమెరా స్విచ్చాన్‌  చేయగా, నాని క్లాప్‌ ఇచ్చి, స్క్రిప్ట్‌ను శైలేష్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ ఓ అమ్మాయి మిస్సింగ్‌ కేసుని ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో ‘హిట్‌’  వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆఫీసర్‌ కృష్ణదేవ్‌ అలియాస్‌ కె.డి ఈ ఎగ్జయిటింగ్‌ జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్, సంగీతం: జాన్‌  స్టీవర్స్‌ ఎడురి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకట్‌ రత్నం (వెంకట్‌).

మరిన్ని వార్తలు