ఫుల్‌ స్పీడ్‌లో నాని సినిమా షూటింగ్‌

7 Jan, 2021 06:21 IST|Sakshi

నాని హీరోగా, సాయి పల్లవి, కృతీశెట్టి (‘ఉప్పెన’ ఫేమ్‌) హీరోయిన్లుగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ షూటింగ్‌ ఫుల్‌ స్పీడ్‌లో జరుగుతోంది. కోల్‌కత్తా నేపథ్యంలో పీరియాడికల్‌ మూవీగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారాం. హైదరాబాద్‌లోని పలు లొకేషన్లలో కీలక సన్నివేశాలను  ఈ నెల 13 వరకూ చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత పండగకి చిన్న బ్రేక్‌ తీసుకుని, మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతారు. ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో వెంకట్‌ బోయిన్‌పల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమటం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ. జె. మేయర్‌

చదవండి: పట్టరాని సంతోషంలో కృతీ సనన్, శ్రద్ధా శ్రీనాథ్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు