Nani: ఆమె సినిమా చూడటం ఇప్పటికే కలగానే అనిపిస్తోంది: నాని

28 Mar, 2023 21:45 IST|Sakshi

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో నాచురల్‌ స్టార్‌ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కెరీర్‌లో తొలిసారిగా పాన్‌ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

దివంగత నటి శ్రీదేవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాని. ఆమెకు ఇప్పుటికీ తాను వీరాభిమానిని అని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ మూవీ క్షణ క్షణం (1991)లో ఆమెను చూడటం తనకు ఇప్పటికీ కలగానే అనిపిస్తుందని అన్నారు. 

ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ..'తన జీవితంపై శ్రీదేవి ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే నా డ్రీమ్ డేట్ కచ్చితంగా శ్రీదేవినే. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఈ రోజు మన మధ్య లేరు. నేను ఎదిగే కొద్దీ శ్రీదేవికి వీరాభిమానిగా మారిపోయా. ఇప్పటికీ కూడా ఆమెకు పెద్ద అభిమానిని.  క్షణ క్షణం సినిమాలో ఆమెను చూస్తుంటే ఇప్పటికీ నాకు కలగానే అనిపిస్తోంది.' అని అన్నారు.

కాగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా సినిమాలో నాని ధరణి అనే పాత్రలో కనిపించనున్నారు. ధరణి పాత్ర తన కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌గా నిలుస్తుందన్నారు నాని. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ జంటగా నటిస్తోంది. 

మరిన్ని వార్తలు