సైదాబాద్‌ హత్యాచార ఘటన: బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు

15 Sep, 2021 10:57 IST|Sakshi

సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘట‌న ఎంత మందిని క‌లిచివేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అభం,శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని రాజు అనే మానవ మృగం అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశాడు. ఆ కీచకుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని వాదనలు వినిపిస్తున్నాయి. సెల‌బ్రిటీలు సైతం రాజుకి క‌ఠిన శిక్ష‌లు వేయల‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌ హీరోలు మహేశ్‌ బాబు, మంచు మనోజ్‌ సోష‌ల్ మీడియా ద్వారా రాజు అనే నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. తాజాగా నాని కూడా ఈ ఘటనపై స్పందించాడు. తెలంగాణ పోలీస్ ట్వీట్‌ని షేర్ చేస్తూ.. బ‌య‌టెక్క‌డో ఉన్నాడు, ఉండ‌కూడ‌దు అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. సామాన్యులు సైతం రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
(చదవండి: సైదాబాద్‌ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్‌)

అయితే ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డ్ అందిస్తామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.  నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు