నాని నో చెప్పాడు.. వైష్ణవ్‌ ఓకే చేశాడు

27 Feb, 2021 09:07 IST|Sakshi

నాని రిజెక్ట్‌ చేసిన కథకు ఓకే చెప్పిన వైష్ణవ్‌ తేజ్‌

ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేసుకునేవారు. ఒకవేళ సదరు హీరోకు ఈ కథ నచ్చకపోతే అది అటకెక్కెది. మరి కొందరు హీరోలు తాము అస్సలు అడుగుపెట్టని జానర్‌ చిత్రాలు చేయాలంటే వెనకంజ వేసేవారు. అభిమానులు తమను అలాంటి చిత్రాల్లో అంగీకరిస్తారో లేదో.. ఎందుకొచ్చిన తలనొప్పి అని ఊరుకునేవారు. ప్రయోగాల జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. జానర్‌తో సంబంధం లేకుండా హీరోలు సినిమాలు యాక్సెప్ట్‌ చేస్తున్నారు. కొత్త కథ అయితే చాలు అంటున్నారు.

ఇక గతంలోలా ఓ హీరో కథను రిజెక్ట్‌ చేస్తే దాన్ని పక్కన పెట్టడం లేదు. మరో హీరోకు ఆ స్టోరి వినిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది టాలీవుడ్‌లో. నాచురల్‌ స్టార్‌ నాని రిజెక్ట్‌ చేసిన ఓ కథను హీరో వైష్ణవ్‌ తేజ్‌ అంగీకరించారట. ఆ వివరాలు.. తాజాగా నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ కొత్త దర్శకుడితో ఓ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారట. యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు తొలుత నానిని హీరోగా అనుకున్నారట. కారణాలు తెలయదు కానీ నాని ఈ కథను రిజెక్ట్‌ చేశాడట. 

దాంతో ఈ స్టోరిని మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌కు వినిపించారట దర్శకుడు. అతడు ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని సమాచారం. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉప్పెన విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న వైష్ణవ్‌ వరుసగా సినిమాలు అంగీకరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జంగిల్‌ బుక్’‌ సినిమాను పూర్తి చేశాడు ఈ మెగా హీరో. తరువాత అన్నపూర్ణ బ్యానర్‌లో ఓ చిత్రం.. దాని తర్వాత భోగవల్లి ప్రసాద్‌ బ్యానర్‌లో తెరకెక్కించే చిత్రాల్లో నటించనున్నాడు. నాని వద్దనకున్న చిత్రం వైష్ణ్‌వ్‌కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. 

ఇక వైష్ణవ్‌ తేజ్‌ డెబ్యూ మూవీ ఉప్పెన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో దీన్ని తమిళం, హిందీలో రిమేక్‌ చేయనున్నారు. బుచ్చిబాబు దర్శకత్వలో వచ్చిన ఉప్పెన చిత్రంలో కృతీ శెట్టి, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. 

చదవండి:
టీజర్‌: ఫైటింగ్‌కు పెళ్లి కొడుకు రెడీ!
డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్‌ప్రైజ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు