ఫిక్సయిపో... ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అని చెప్పా!

3 Apr, 2021 00:27 IST|Sakshi

– నాని

‘‘కెరీర్‌ పరంగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా ‘టక్‌ జగదీష్‌’. ఫుల్‌ ఎమోషనల్‌ డ్రామా. ఇది మన మట్టి సినిమా. మన తెలుగు సినిమా’’ అని నాని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఇందులో ఐశ్వర్యా రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది . ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాని మాట్లాడుతూ –‘‘టక్‌ జగదీష్‌’ ఫైనల్‌ కట్‌ చూసి, బయటకు రాగానే.. ఫిక్సయిపో.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అని డైరెక్టర్‌తో చెప్పాను. సమ్మర్‌ అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా స్పెషల్‌.

మా సినిమానే కాదు... వేసవిలో విడుదలవుతున్న సినిమాలన్నీ విజయం సాధించాలి’’ అని అన్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఫ్యామిలీ కూడా మిస్‌  కాకుండా చూడాల్సిన సినిమా ఇది. నా కెరీర్‌లో మళ్లీ ఇలాంటి ఓ ఫ్యామిలీ డ్రామా తీస్తానో.. లేదో తెలియదు. అందుకే నాకు తెలిసిన అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించాను’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘గ్రేట్‌ ఎమోషన్స్‌, ఫ్యామిలీ బాండింగ్‌ ఉన్న సినిమా ఇది. విడుదలయిన కొంతకాలం తర్వాత కూడా ఈ సినిమాలోని పాటలు, ఎమోషన్స్‌, కథ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు’’ అన్నారు తమన్‌ . ‘‘ఫ్యామిలీ ఆడియన్స్‌కు, యూత్‌కు నచ్చే ఓ మంచి సినిమా తీశాం’’ అన్నారు సాహు.

మరిన్ని వార్తలు