నానికి విలన్‌గా మరో యంగ్‌ హీరో

6 Nov, 2020 16:21 IST|Sakshi

ఫలితాలతో సంబంధం లేకుండా చకచకా సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు మన నేచురల్‌ స్టార్‌ నాని. తను నటించిన చాలావరకు సినిమాలు అరే.. మన పక్కింటి అబ్బాయిలాగే ఉన్నాడే అనిపించేలా ఉంటాయి. కానీ శ్యామ్‌ సింగరాయ్‌తో కొంచెం రూట్‌ మార్చినట్టు అనిపిస్తోంది. పాత కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఈ సినిమాకు బడ్జెట్‌ కూడా భారీగానే ఉంటుందని టాక్‌. ఇప్పటివరకు నాని చేసిన సినిమాలేవీ ఎక్కువ బడ్జెట్‌ పెట్టి తీసినవి కావు. అన్నీ సింపుల్‌గా సాగిపోయే ఫీల్‌ గుడ్‌ సినిమాలే.. అందుకే అవి చాలావరకు అందరినీ మెప్పిస్తూ నానిని నేచురల్‌ స్టార్‌గా నిలబెట్టాయి.

ఇద్దరు హీరుయిన్లు ఉండే శ్యామ్‌ సింగరాయ్‌లో సాయి పల్లవితో మరోసారి జోడి కడుతున్నాడు నాని. ఇంకొక హీరోయిన్‌గా తన మొదటి రిలీజ్‌ అవ్వకముందే వరుస అవకాశాలు అందుకున్న కృతి శెట్టి అలరించబోతుంది. టాక్సీవాలాతో గుర్తింపు తేచ్చుకున్న రాహుల్‌ సంకృత్యాన్‌ దీనికి దర్శకత్వం వహిస్తుండగా నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో వెంకట బోయనపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. దసరాకు రిలీజ్‌ చేసిన సినిమా టైటిల్‌ పోస్టర్‌ పర్వాలేదనిపించింది.      చదవండి:  (ఇటలీని షేక్‌ చేస్తున్న ప్రభాస్‌ మేనియా)

ఇక ఈ సినిమాలో ఓ పాత్ర కోసం మరో యంగ్‌ హీరో నారా రోహిత్‌ నటిస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నారా రోహిత్‌ ఏదైనా కీలక పాత్రలో కనిపిస్తాడా లేక విలన్‌గా నానితో తలబడనున్నాడా తెలియాల్పి ఉంది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమాలో నారా రోహిత్‌ నటిస్తున్నాడని వార్తలు వచ్చినా అందులో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది. శ్యామ్‌ సింగరాయ్‌ గురించి వస్తున్న వార్తలయినా నిజమా కాదా వేచి చూడాల్పిందే. యంగ్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నానికి ఏమాత్రం కొత్త కాదు. నాని చివరి చిత్రం 'వి'లో సుధీర్‌ బాబుతో, గ్యాంగ్‌లీడర్‌లో కార్తికేయతో, అంతకుముందు విజయ్‌ దేవరకొండతో కూడా కలిసి నటించాడు. యంగ్‌ హీరోలతోనే కాదు సీనియర్‌ నటుడు నాగార్జునతో దేవదాస్‌ అనే మల్టీస్టారర్‌ కూడా చేశాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు