ఫ్లాష్‌బ్యాక్‌ నారప్ప

6 Nov, 2020 06:02 IST|Sakshi

వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. 2019లో విడుదలై తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. సురేశ్‌ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. చిత్రనిర్మాతలు డి. సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను మాట్లాడుతూ– ‘నారప్ప’ సినిమా లాక్‌డౌన్‌కు ముందే 60 రోజులపాటు షూటింగ్‌ జరుపుకుంది. తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ మధ్యే షూటింగ్‌ను హైదరాబాద్‌లో పునః ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేశ్, రాజీవ్‌ కనకాల తదితరులు పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలతో పాటు కై్లమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం సినిమా పూర్తవుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వెట్రిమారన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు