Malli Pelli Trailer: మూడో భార్యను తన్నిన నరేశ్‌.. మళ్లీ పెళ్లి ట్రైలర్‌ చూశారా?

11 May, 2023 11:53 IST|Sakshi

సీనియర్‌ నటుడు నరేష్‌-పవిత్రా లోకేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రా‍న్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. 

'తెలుగు ఇండస్ట్రీ కన్నడ వైపు చూపు తిప్పిందేంటి?..' అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. పార్వతి.. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? అని నరేశ్‌ అడగ్గా.. చాలా బాగా చూసుకుంటాడని బదులిచ్చింది పవిత్ర అలియాస్‌ పార్వతి. అయినా పెళ్లైన ఆవిడతో మీకు లవ్వేంటి? సర్‌ అని మధ్యలో ఓ డైలాగ్‌ నరేశ్‌ మనసులోని మాటను బయటపెట్టింది.

'అసలైన సూపర్‌స్టార్‌ పెద్ద భార్య కొడుకే నరేంద్ర.. ఆయనకు మూడు పెళ్లిళ్లయ్యాయి..', 'నీతో రిలేషన్‌ ఉందని ఒప్పుకుంటే వాళ్లడిగే మొదటి ప్రశ్న.. ఉంచుకున్నారా? అని!' అంటూ వచ్చే డైలాగులు నరేశ్‌ రియల్‌ స్టోరీని గుర్తు చేసేలా ఉన్నాయి.. అలాగే నరేశ్‌ తన మూడో భార్యను తన్నడం.. చివర్లో నరేశ్‌, పవిత్ర ఒక హోటల్‌ గదిలో ఉంటే అతడి మూడో భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు రెడీ అయిన సన్నివేశం చూపించారు. మొత్తానికి ఈ ట్రైలర్‌ ద్వారా నరేశ్‌ తన రియల్‌ లైఫ్‌ స్టోరీని సినిమాగా తీస్తున్నాడని ఇట్టే అర్థమైపోతుంది.

చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం

మరిన్ని వార్తలు