నవ్వించేందుకు రెడీ అవుతున్న 'నటరత్నాలు’

14 May, 2022 12:13 IST|Sakshi

కంటెంట్‌లో దమ్ముంటే చిన్న సినిమాలను కూడా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్‌లో చోటా సినిమాలు భారీగా వస్తుంటాయి. డిఫరెంట్‌ స్టోరీలపై ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ చూపుతున్న నేపథ్యంలో.. యంగ్‌ డైరెక్టర్స్‌ అలాంటి కథలతో సినిమాలను తెరకెక్కించి, విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. తాను కూడా అలాంటి డిఫరెంట్‌ కథతోనే ‘నటరత్నాలు’తెరకెక్కిస్తున్నానని చెబుతున్నాడు దర్శకుడు గాదె నాగభూషణం. ఎన్.ఎస్  నాగేశ్వర రావు నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న వినూత్న కథాంశం 'నటరత్నాలు'. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి.

అతిత్వరలో పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభోత్సవం చేయబోతున్నారు మేకర్స్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పరివేక్షణ నర్రా  శివ నాగు వహించగా ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్,డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి,  తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా కథకు తెరరూపమివ్వబోతున్నారట. జూన్ మొదటివారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి త్వరత్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నామని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు