వెంటనే ఆ యాడ్‌ నుంచి తప్పుకోండి అమితాబ్‌: నాటో అధ్యక్షుడు లేఖ

24 Sep, 2021 11:44 IST|Sakshi

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కు నేషనల్‌ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్‌(నాటో) సంస్థ సంచలన లేఖ రాసింది. పాన్‌ మసాల ప్రమోషన్‌ యాడ్‌ నుంచి వైదొలగాలని నాటో అధ్యక్షుడు శేఖర్‌ సల్కర్‌ అమితాబ్‌ను కోరారు. పాన్‌ మసాలాలో పొగాకు ఉంటుందని, ఇది ప్రజలను వ్యసపరులుగా మారుస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఇలాంటి వాణిజ్య​ ప్రకటనల నుంచి అమితాబ్‌ వీలైనంత త్వరగా తప్పుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

చదవండి: రూ. 400 కోట్ల ఆఫర్‌ తిరస్కరించిన అగ్ర నిర్మాత

అలాగే ‘అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నారు.  అలాంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్‌లో నటించడం సరికాదు. వెంటనే అమితాబ్ ఈ యాడ్ నుంచి తప్పుకోవాలి. అప్పుడు పొగాకు వ్యసనానికి యువత దూరమయ్యేందుకు ఈ చర్య దోహదపడుతుంది’ అన్నారు. అంతేగాక పాన్ మసాల క్యాన్సర్ కారకంగా పని చేస్తోందనే విషయం పరిశోధనల్లో తేలిందని,  అందులోని పదార్ధాలు నోటి క్యాన్సర్‌కు దారి తీస్తాయంటూ శేఖర్ సల్కర్ తన లేఖలో రాసుకొచ్చారు.  ఇక ఆయన విజ్ఞప్తి మేరకు బిగ్‌బి ఈ ప్రకటన నుంచి తప్పుకుంటారా? లేదా? ఈ లేఖపై అమితాబ్‌ ఎలా స్పందిస్తారనేది తెలుసుకోవాలంటూ దీనిపై అమితాబ్‌ స్పందించే వరకు వేచి చూడాలి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు