చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ కన్నుమూత

24 Jun, 2021 14:55 IST|Sakshi

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌, దర్శకుడు శివన్‌ (89)కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయోభారం, అనారోగ్యం బాధపడుతున్న ఆయన గురువారం(జూన్‌ 24) కేరళరాష్ట్రం తిరువనంతపురంలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తండ్రే శివన్‌. 60 ఏళ్ల క్రితం తిరువనంతపురంలో శివన్‌ స్టూడియో పేరుతో ఓ ఫోటో స్టూడియో పెట్టిన శివన్‌.. స్టిల్ ఫోటోగ్రాఫర్ గా శివన్ విశేష ఖ్యాతి గడించారు. పలు సాంస్కృతిక సంస్థలకు ఆయన ఫోటో స్టూడియోనే కేంద్రంగా ఉండేది. ఆయన తీసిన ఛాయాచిత్రాలు నేషనల్ జియోగ్రాఫిక్, న్యూస్ వీక్, స్పాన్ వంటి పలు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. నిర్మాత, దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆయన రూపొందించిన ‘అభయమ్’ మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది.శివన్‌కి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.  శివన్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ అహ్మద్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు