ప్రముఖ దర్శకుడు కన్నుమూత

14 Mar, 2021 12:04 IST|Sakshi

‘అయ్యర్‌కై ’  జాతీయ అవార్డు అందుకున్న జననాథన్‌

సాక్షి, చెన్నై:  తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.  జాతీయ అవార్డు గ్రహీత,  ప్రముఖ దర్శకుడు ఎస్‌సీ జననాథన్ ఆదివారం కన్నుమూశారు. జననాథన్‌ అకాలమరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు,  ఇతర నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన  రోల్ మోడల్,  కమ్యూనిస్ట్‌ సిద్ధాంతకర్త కారల్‌ మార్క్స్‌ వర్ధంతి రోజే  ఆయనకూడా కన్నుమూశారంటూ గుర్తు చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డైరెక్టర్ జననాథన్ ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారని మరో డైరెక్టర్ ఆర్ముగకుమార్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. (అవార్డు వేడుకలో వేదికపై పూర్తి నగ్నంగా నటి)

హీరోయిన్‌ శృతిహాసన్‌  జననాథన్ మృతిపై సంతాపం ప్రకటించారు. భారమైన హృదయంతో గుడ్‌బై చెబుతూ ట్వీట్‌ చేశారు. ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగానూ గర్వంగానూ ఉంది. తన ఆలోచనలలో ఎప్పుడూ బతికే ఉంటారంటూ శృతి నివాళులర్పించారు. 

సినిమా ఎడిటింగ్‌ పనిలో ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లారు. అయితే జననాథన్ ఎక్కువసేపు తిరిగి రాకపోవడంతో, సిబ్బంది తనిఖీ చేయగా, అపస్మారక స్థితిలో పడి ఉండగా గుర్తించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.  బ్రెడ్‌ అయినట్టుగా తెలిపిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చివరకు  ఆయన తుది శ్వాస తీసుకున్నట్లుగా  ఆదివారం ప్రకటించారు. కాగా విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ లాబాం   పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు జననాథన్. కరోనావైరస్ మహమ్మారి కారణంగా  ఈ  మూవీని ఈ సంవత్సరం విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. జననాథన్ 2004 సంవత్సరంలో అయ్యర్‌కై  సినిమాకు తమిళంలో జాతీయ ఉత్తమ చలన చిత్ర అవార్డును గెలుచుకున్నారు. 

మరిన్ని వార్తలు