నకుల్‌, శ్రీకాంత్‌ నట్టి హీరోలుగా కొత్త చిత్రం

7 Oct, 2022 10:37 IST|Sakshi

నటుడు నకుల్, శ్రీకాంత్, నట్టి నటరాజ్‌ హీరోలుగా నూతన చిత్రం బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సాలోమ్‌ స్టూడియోస్‌ సంస్థ అధినేత జాన్‌ మాక్స్‌ నిర్మిస్తున్న 9వ చిత్రం ఇది. ఎం.తిరుమలై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వైఎన్‌ మురళి చాయాగ్రహణం, సుందర్‌ సీ బాబు సంగీతం అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్‌ను అతిత్వరలో ప్రారంభించనున్నట్లు దర్శకుడు తెలిపారు.

ఇందులో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను అతి త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని, పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ ప్రారంభోత్సవానికి దర్శకుడు, నటుడు సీఆర్‌సీ రంగనాథన్, దర్శకుడు పీవీ ప్రసాద్, రంజిత్, మహేంద్రకుమార్‌ నాగర్‌ తదితర సినీ ప్రముఖులు అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నకుల్, శ్రీకాంత్, నట్టి హీరోలుగా నూతన చిత్రం

మరిన్ని వార్తలు