Nani Dasara Movie Song Release: 'ధూమ్ ధామ్ దోస్తాన్' సాంగ్ అవుట్.. హోరెత్తిస్తున్న డప్పుల మోత

3 Oct, 2022 19:18 IST|Sakshi

నాచురల్ స్టార్ నాని, అందాల రాశి కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'దసరా'. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని లుక్‌ ఇంతవరకు ఎన్నడు చూడని రేంజ్‌లో ఉండనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం. ధూం.. ధాం.. దోస్తాన్​ అంటూ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్‌ను మాస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.  

(చదవండి: ‘గాడ్ ఫాదర్’ టైటిల్ సాంగ్ రిలీజ్.. ఇంకెందుకు ఆలస్యం వినేయండి..!)

 సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో నాని పక్కా మాస్‌గా ‍అలరించనున్నారు. ఈ సినిమాలో సముద్ర ఖని, సాయి కుమార్​, జరీనా వాహబ్​ లాంటి నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'దసరా' తెలుగుతో పాటు తమిళం​, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అచ్చమైన తెలంగాణ యాసలో నాని అద్భుతంగా డైలాగులు చెప్పాడు. తెలంగాణ సంస్కృతి ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు దర్శకుడు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు