Nani30 Update: నాని కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్‌.. హీరోయిన్‌గా మృణాల్‌

29 Jan, 2023 16:57 IST|Sakshi

నాచురల్‌ స్టార్‌ నాని ఇటీవలె దసరా సినిమా షూటింగును పూర్తి చేశారు. ఇప్పడు మరో కొత్త సినిమాను పట్టాలెక్కించే పనులో పడ్డారు. నాని కెరీర్‌లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.తండ్రి, కూతుళ్ల అనుబంధాల నేపథ్యంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈనెల 31న పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్‌ చేయనున్నారు.ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.హృదయం మూవీ ఫేమ్‌ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.
 

మరిన్ని వార్తలు