అందరికీ ఆత్మీయుడు ఆనంద్‌

17 May, 2021 09:18 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై : ఆయన పేరులోనే కాదు.. వ్యక్తిత్వం కూడా ఆనందకరం, అనుసరణీయమని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. ప్రముఖ సినీ గాయకులు, సంగీత దర్శకులు దివంగత జీ ఆనంద్‌కు పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. కరోనా వైరస్‌ సోకి ఇటీవల హైదరాబాద్‌లో అశువులు బాసిన జీ ఆనంద్‌ను గుర్తు చేసుకుంటూ నవసాహితీ ఇంటర్నేషనల్‌ (చెన్నై) వారు శనివారం రాత్రి “ఒక వేణువు వినిపించిన విషాద గీతిక’ పేరున స్వర నివాళులర్పించారు. అంతర్జాలమే వేదికగా ఏర్పాటు చేసుకుని నిర్వహించిన ఈ కారక్రమంలో దేశ, విదేశాల నుంచి పలువురు పాల్గొని జీ ఆనంద్‌తో తమకున్న పరిచయాన్ని, అనుభవాలను, ఆనందపు క్షణాలను గుర్తు చేసుకున్నారు.

ముందుగా, నవసాహితీ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌వీ సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సీనియర్‌ జర్నలిస్టుగా రాజకీయ వార్తలు రాసేవాడినని, అయినా సంగీతం, సాహిత్యాభిలాషతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆనంద్‌కు ఆప్తుడయ్యానని చెప్పారు. ఎస్పీ బాలుకు, ఆనంద్‌కు సినీ పరిశ్రమ ఘన నివాళులర్పించకపోవడం బాధాకరమన్నారు. తనకు 20 ఏళ్లుగా ఆనంద్‌తో పరిచయం అని, అతడో నిత్యసంతోషి, ఆనంద్, సుజాత ఆదర్శ దంపతులుగా మెలిగారని అని ప్రముఖ ఆడిటర్‌ జేకే రెడ్డి గుర్తు చేశారు. సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్‌ మాట్లాడుతూ తనకు 50 ఏళ్ల అనుబంధం అని, జీ ఆనంద్‌ సార్థక నామథేయుడు తెలిపారు.

చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్‌ కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం

ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక

మరిన్ని వార్తలు