నచ్చినవే చేయాలనుకుంటున్నాను

5 Mar, 2021 05:09 IST|Sakshi

‘‘ఇన్ని రోజులూ నాకు వచ్చిన రోల్స్‌ చేయాలా? లేక నచ్చినవి చేయాలా? అనే కన్‌ ఫ్యూజన్‌  ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు నచ్చినవే చేయాలని డిసైడ్‌ అయ్యాను’’ అన్నారు నవదీప్‌. మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్, సునీల్‌శెట్టి ప్రధాన పాత్రధారులుగా జెఫ్రీ చిన్‌  దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోసగాళ్ళు’. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన నవదీప్‌ చెప్పిన విశేషాలు.

► ఓ మోస్తరుగా చదువు వచ్చిన బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ కలిసి కాల్‌ సెంటర్‌ ఆధారంగా అమెరికాలో 150 మిలియన్‌  డాలర్ల స్కామ్‌ను ఎలా చేశారు? అనే అంశంతో ‘మోసగాళ్ళు’ సినిమా ఉంటుంది. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జెఫ్రీ చిన్‌ తో సినిమా చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. మంచు విష్ణు సినిమా స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు చాలా ఆసక్తి అనిపించింది. టెక్నాలజీలోని లోటుపాట్లను వాడుకుని స్కామ్‌ చేయడమనే అంశం ఆడియన్స్‌ను థ్రిల్‌ చేస్తుంది.

► ఈ సినిమాలో నాది వైట్‌ కాలర్‌ క్రిమినల్‌ జాబ్‌. మహిళలను తక్కువగా అంచనా వేసే పాత్ర. కథ ప్రకారం మంచు విష్ణు, కాజల్‌ నన్ను మోసం చేస్తారు.  ఒక్క మాటలో చెప్పాలంటే సునీల్‌
శెట్టిగారు తప్ప మేమందరం మోసగాళ్ళమే.

► నా స్నేహితుడు పవన్‌ తో కలిసి ఆరంభించిన ‘సీ స్పేస్‌’లో దాదాపు 40 మంది రైటర్స్‌ ఉన్నారు. ఓ పేపర్‌ కటింగ్‌ తీసుకువచ్చి మా ‘సీ స్పేస్‌’లో ఇచ్చి సినిమాకు కథ కావాలంటే చేసిన ఇస్తాం. వెబ్‌ సిరీస్‌గా డెవలప్‌ చేయమన్నా చేస్తాం. ఓ ఫ్యాంటసీ లవ్‌స్టోరీలో హీరోగా నటించబోతున్నాను.

మరిన్ని వార్తలు