ద్విభాషా చిత్రం​.. క్లాప్‌ కొట్టిన అలీ

19 Feb, 2022 11:09 IST|Sakshi

రెండు భాషల్లో షురూ ప్రకాశ్‌రాజ్, నవీన్‌ చంద్ర, కార్తీక్‌ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళ్‌) చిత్రం షురూ అయింది. వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో వాణీ బోజన్, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ అండ్‌ కావ్య సమర్పణలో థింక్‌ బిగ్‌ బ్యానర్‌పై దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్, శ్రీ షిరిడీ సాయి మూవీస్‌ అధినేత యం. రాజశేఖర్‌ రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీ క్రియేషన్స్‌పై బి. నర్సింగరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

తొలి సన్నివేశానికి నిర్మాత సి. కల్యాణ్, దర్శక–నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు అలీ క్లాప్‌ కొట్టారు. దర్శకుడు అజయ్‌ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. యం. రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘నేను చెప్పిన ఈ సినిమా కథను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్న ప్రకాశ్‌ రాజ్, ఏ.ఎల్‌ విజయ్, నవీన్‌ చంద్రలకు థ్యాంక్స్‌’’ అన్నారు. నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు వేగేశ్న సతీష్, రచయిత జనార్ధన మహర్షి, సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ అతిథిలుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గురుదేవ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ మల్లాల.

మరిన్ని వార్తలు