Naveen Polishetty: సినిమా షూటింగ్ ఇక్కడే చేశాం.. అందుకే చాలా ఇష్టం: పోలిశెట్టి

26 Aug, 2023 17:58 IST|Sakshi

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వచ్చేనెల 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ట్రైలర్‌ రిలీజ్‌ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు నవీన్ పోలిశెట్టి. తాజాగా నెల్లూరులో సందడి చేశారు. ఆయనను చూసిన అభిమానులు సైతం సెల్ఫీల కోసం ఎగబడ్డారు. 

(ఇది చదవండి: క్రైమ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !)

పోలిశెట్టి మాట్లాడుతూ.. 'నా సినిమా ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్‌ 80 శాతం నెల్లూరులోనే జరిగింది. ఇక్కడి ఫుడ్‌ సూపర్‌. నాకు ఎంతో ఇష్టం.' అని అన్నారు. నగరంలోని మద్రాస్‌ బస్టాండ్‌ కూరగాయల మార్కెట్‌ ప్రాంతంలో పలువురు ఫుడ్‌ బ్లాగర్స్‌తో ముచ్చటించారు.అనంతరం మినీబైపాస్‌ రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నవీన్‌ మాట్లాడారు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్‌ సమయంలో నగర వీధుల్లో తిరిగానని.. ఈ ప్రాంతం బాగా తెలుసన్నారు. ఇందులో హీరోయిన్‌గా అనుష్క నటించడం సంతోషంగా ఉందన్నారు. కథపై ఎంతో నమ్మకంతో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంజీబీ మాల్లో జరిగిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు