మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశాడు.. హీరో భార్య సంచలన ఆరోపణలు

4 Mar, 2023 00:33 IST|Sakshi

నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బాలీవుడ్ నటుడిపై అతని భార్య ఆలియా సంచలన కామెంట్స్ చేశారు. తనను , పిల్లలను ఇంటినుంచి గెంటేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత కొంత కాలంగా వీరిద్దరికి విడాకులు, ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. కాగా.. ఇటీవల నవాజుద్దీన్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలవడానికి ముంబైలోని వెర్సోవాలోని తన బంగ్లాకు చేరుకున్నాడు. అయితే అక్కడ ఇంట్లోకి రాకుండా సోదరుడు ఫైజుద్దీన్ అడ్డుకున్నాడని నవాజుద్దీన్ ఆరోపించారు.

తాజాగా అతని భార్య ఆలియా బంగ్లా బయట నుంచి ఓ వీడియోను షేర్ చేసింది. అక్కడ ఆమె కుమార్తె షోరాను లోపలికి అనుమతించలేదని ఆ వీడియోలో ఏడుస్తూ కనిపించింది. నవాజుద్దీన్ భార్య ఆలియా మాట్లాడుతూ..' తన పిల్లలను కూడా విడిచిపెట్టని నవాజుద్దీన్ సిద్ధిఖీ నైజం ఇదే. 40 రోజుల పాటు ఇంట్లో ఉన్న నేను వెర్సోవా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. కానీ నేను తిరిగి వచ్చాక నవాజుద్దీన్ సిద్ధిఖీ మమ్మల్ని లోపలికి రానివ్వకుండా చాలా మంది కాపలాదారులను నియమించాడు.. నన్ను, నా పిల్లలను నడిరోడ్డుపై వదిలేశాడు.. తన సొంత తండ్రి తనతో ఇలా చేస్తాడని నా కుమార్తె నమ్మలేకపోయింది. రోడ్డుపై ఏడుస్తున్న మమ్మల్ని నా బంధువుల్లో ఒకరు ఇంటికి తీసుకువెళ్లారు. నా పిల్లలను ఇంట్లో నుంచి తరిమి రోడ్లపై నిలబెట్టిన వ్యక్తి నవాజుద్దీన్ సిద్ధిఖీ. అతని అసలు రూపం ఇదే. నవాజుద్దీన్ మీరు నన్ను మా నా పిల్లలను విచ్ఛిన్నం చేయలేరు. నేను న్యాయం జరిగే పోరాడుతూనే ఉంటానంటూ వీడియోలను షేర్ చేశారు. 

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)

మరిన్ని వార్తలు