ఇంట్లో బంధించి చిత్రహింసలు పెడుతున్నారు: ఆలియా

27 Jan, 2023 20:00 IST|Sakshi

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య సంచలన ఆరోపణలు చేసింది. ఆస్తి వివాదంలో ఆమెపై పోలీసులకు నవాజుద్దీన్ తల్లి మెహ్రునిసా సిద్ధిఖీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతని భార్య ఆలియా కీలక వ్యాఖ్యలు చేసింది. తనను ఇంట్లో చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఆహారం తినేందుకు వెళ్తే వంటగదిలోకి కూడా రానివ్వడం లేదని వాపోయారు. కనీసం ఫుడ్ డెలీవరి ఏజెంట్లను సైతం ఇంట్లోకి అనుమతించలేదని తెలిపింది. అయితే అయితే పాస్‌పోర్ట్ సమస్యల కారణంగా ఆలియా ఇటీవలే తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆంధేరిలోని భర్త ఇంటికి తిరిగొచ్చింది. 

ఆలియా మాట్లాడుతూ.. 'నన్ను వంటగదిలోకి కూడా అనుమతించలేదు.  రూమ్ సోఫాలోనే నా బెడ్‌ను తయారు చేసుకున్నా. ఆహారం పంపే నా స్నేహితులను లోపలికి రానివ్వలేదు. నేను బయటకు వెళ్లడానికి భయపడుతున్నా. కనీసం ఆహారం తీసుకునేందుకు గేటు వద్దకు వెళ్లలేకపోతున్నా. నా గది తలుపులు మూసి ఉంచారు. ఈ విషయంలో పోలీసులకు తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేయడానికి రాలేదు. దీంతో తన లాయర్ ద్వారా దానిని పూర్తి చేయగలిగా.  నాకు దశాబ్ద కాలంగా నవాజ్ తెలుసు. అందుకే అతనిని పెళ్లి చేసుకున్నా. కాబట్టి అతని భార్యగా నేను ఇంట్లో ఎందుకు ఉండకూడదు? డెలివరీ ఏజెంట్లను కూడా ఇంట్లోకి అనుమతించడం లేదు. న్యాయబద్ధంగా ఇంట్లో ఉండేందుకు నాకు హక్కుంది.' అని అన్నారు. 

(ఇది చదవండి: అతియా శెట్టి-కేఎల్ రాహుల్‌కు ఖరీదైన బహుమతులు...!)

కాగా.. ఆలియా నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో భార్య. నవాజుద్దీన్, ఆలియా పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఏడాది క్రితమే వీరు విడిపోయారు. 2020లో ఆలియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నవాజ్ సోదరుడు శారీరక హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ తర్వాత 2021లో నవాజుద్దీన్‌తో విడాకులు తీసుకోవాలనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. దుబాయ్ నుంచి ఆలియా తిరిగి రావడంతో నవాజుద్దీన్ తల్లి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంధేరి బంగ్లాలో ఆలియా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అయితే ఆలియా ఆరోపణలపై నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పందించలేదని తెలుస్తోంది. ఈ విషయంలో చట్టపరమైన మార్గంలో వెళ్లాలని అతను యోచిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు