ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పిన నయనతార ?

11 May, 2021 16:45 IST|Sakshi

కోలీవుడ్‌ లవ్‌ కపుల్‌ విఘ్నేష్‌ శివన్-నయనతారలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హైలైట్‌ అవుతూనే ఉంటుంది. ఈ జంట పెళ్లి చేసుకోరు. కనీసం ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పరు. అయినా సహజీవనం చేస్తున్నారు. కలిసి ఏ దేశానికి విహారయాత్రలకు వెళ్లినా, పుట్టిన రోజు, రెండు రోజు వేడుకలను జరుపుకున్నా వెంటనే ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా లవ్‌కపుల్‌కి సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంటకు త్వరలోనే పెళ్లిచేయాలని విఘ్నేష్‌ తల్లిదండ్రులు భావిస్తున్నారట. చాలాకాలంగా డేటింగ్‌ చేస్తున్న వీరిద్దరిని భార్యభర్తలు చేయాలని విఘ్నేష్‌ పేరేంట్స్‌ అనుకుంటున్నారట. పెళ్లికి నయన్‌ నో చెప్పిందట. ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని, కరోనా పరిస్థితులు చక్కబడ్డాక వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. ఇందుకు విఘ్నేష్‌ కూడా ఓకే చెప్పినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేశారని టాక్‌. ఇదే నిజమైతే వచ్చే ఏడాది నయనతార మిసెస్‌ నయనతార విఘ్నేష్‌గా మారనుంది. 

చదవండి : 
ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో

ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు