పెళ్లి తర్వాత కూడా నయన్‌ నటిస్తుందా?, హీరోయిన్‌ స్పందన

8 Sep, 2021 16:50 IST|Sakshi

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార త్వరలో ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ను పెళ్లి చేసుకోబోతోన్న సంగతి తెలిసిందే. అయిదేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నయన్‌ పెళ్లి అనంతరం నటిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఫిలిం దూనియాలో చర్చనీయాంశంగా మారింది. దశాబ్ద కాలంగా తెలుగు, తమిళ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది నయన్‌. కాగా ఈ మధ్య గ్లామర్‌ రోల్‌లు పక్కన పెట్టి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో పాటు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలా లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగింది. అంతేగాక దక్షిణాన అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర నటిగా నయన్‌ గుర్తింపు పొందింది.

చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్‌ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్‌ చూశారా!

అయితే విఘ్నేశ్‌తో వివాహనంతరం ఆమె నటిస్తారా లేదా అనే దానిపై ఫ్యాన్స్‌ అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తను నటనను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, పెళ్లి తర్వాత తన సినీ కేరీర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని స్పష్టం చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా ప్రస్తుతం నయనతార చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె హిందీలో షారుక్‌ ఖాన్‌తో ‘అట్లీ’, ప్రియుడు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కాతువాకుల రెండు ఖాదల్‌’ మూవీలో నటిస్తోంది. ఇందులో విజయ్‌ సేతుపతి, అక్కినేని కోడలు సమంత కూడా నటిస్తున్నారు. కాగా లాక్‌డౌన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ లవ్‌ బర్డ్స్‌ డిసెంబర్‌లో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు