Nayantara: సత్యదేవ్‌కు భార్యగా నయనతార

19 Aug, 2021 21:20 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వంలో తమిళ రీమేక్‌ ‘లూసిఫర్‌’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చిరు ‘లూసిఫర్‌’ షూటింగ్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో మిగతా తారగణం ఒక్కొరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. అయితే ఇందులో మెగాస్టార్‌ సోదరిగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక నటుడు సత్యదేవ్‌ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒరిజినల్‌ వెర్షన్‌లో వివెక్‌ ఒబెరాయ్‌ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్‌ చేస్తున్నాడు.

చదవండి: పెళ్లి త్వరలోనే, ఈ సారి ఎలాంటి దాపరికం లేదు: నయన్‌

ఇదిలా ఉంటే ఈ మూవీలో సత్యదేవ్‌కు నయనతార భార్యగా కనిపించనుందట. ఈ పాత్రకు నయన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సోలో హీరోగా స‌క్సెస్ రూట్‌లోకి వ‌చ్చిన స‌త్య‌దేవ్ కెరీర్కు ఈ చిత్రం పెద్ద ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కాగా బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ చెందిన స్టార్‌ నటీనటులు ఈ మూవీలో భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందులో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నట్లు వార్తలు వినిపించగా.. తమిళంలో పృథ్విరాజ్ సుకుమార‌న్ పాత్ర‌లో స‌ల్మాన్ ఖాన్ క‌నిపించనున్నట్లు తెలుస్తోంది. మాలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌లో గాడ్‌ ఫాదర్‌ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. 

చదవండి: బిగ్‌బాస్‌ 5: కంటెస్టెంట్స్‌ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్‌!

మరిన్ని వార్తలు