పెళ్లిపై స్పందించిన విఘ్నేష్‌.. డబ్బు ఆదా చేస్తున్నామని వెల్లడి

28 Jun, 2021 16:58 IST|Sakshi

నయన్‌ చేసే ఆ వంట నా ఫేవరెట్‌ : విఘ్నేష్‌

కోలీవుడ్‌ లవ్‌ కపుల్‌ నయనతార-విఘ్నేష్‌ శివన్‌లు దాదాపు నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారన్న సంగతి తెలిసిందే.  ఈ జంట గురించి ఎప్పుడూ ఏదో ఓ వార్త హైలేట్‌ అవుతూనే ఉంటుంది. ఇటీవలె వీరి పెళ్లి టాపిక్‌ మరింత హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో నయన్‌-విఘ్నేష్‌ల పెళ్లి ఉంటుందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే విఘ్నేశ్‌ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. ప్రస్తుతం తామిద్దరం ఎవరి సినిమాలతో వాళ్లు ఫుల్‌ బిజగా ఉన్నామని, కెరీర్‌పరంగా మేం సాధించాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా  డేటింగ్‌ లైఫ్‌పై తమకు బోర్‌ కొట్టినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తామంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు. అయితే తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. త్వరలోనే నయన్‌-విఘ్నేష్‌లు దంపతులుగా మారనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు.

తాజాగా నెటిజన్లతో సంభాషించిన ఆయన వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.ఇందులో భాగంగా ఓ యూజర్‌..మీరు, నయన్‌ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు? మీ పెళ్లి కోసం చాలా ఎదురుచూస్తున్నాం అని పేర్కొనగా..వివాహం ఖరీధైనదని, ఆ శుభ కార్యక్రమానికి డబ్బు ఆదా చేస్తున్నాను అని బదులిచ్చాడు. అంతేకాకుండా త్వరగా కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో పెళ్లికి తామిద్దరం సిద్ధంగానే ఉన్నామని, కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే పెళ్లి ఉంటుందని విఘ్నేష్‌ హింట్‌ ఇచ్చేశాడు. ఇదే నిజమైతే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది నయనతార వివాహం జరగనుంది. ఇంక మరో నెటిజన్‌ నయనతార వండే వంటకాల్లో మీకు ఏం ఇష్టం అని అడగ్గా..ఘీ రైస్‌, చికెన్‌ కర్రీ అని విఘ్నేష్‌ తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార ప్రస్తుతం 'కాతు వాకులా రేండు కదల్' చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో సమంత కీలకపాత్రలో కనిపించనుంది. 

చదవండి : నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్‌ శివన్‌
రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిన నయన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు