Nayanthara: మాంసం కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నయనతార

8 Aug, 2022 14:42 IST|Sakshi

ప్రముఖ సంస్థ ఫిపోలాకు ప్రచార కర్తగా సౌత్‌ లేడి సూపర్‌ స్టార్‌ నయనతారను నియమించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక సీఈఓ సుశీల్‌ కనుగోలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం (ఆగస్టు 7) జరిగిన సమావేశంలో సశీల్‌ మాట్లాడుతూ ''దక్షిణ భారతదేశంలోని అత్యత్తుమ మాంసం రిటైల్‌ బ్రాండ్‌లలో ఒకటైన ఫిపోలా ఆహార ప్రియులను ఆకర్షించడంతోపాటు మంచి ఆదరణ ఉందన్నారు. దీనిని మరింతగా విస్తరణ చేసేలా దృష్టి పెట్టాం'' అని తెలిపారు.

అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతారను తమ బ్రాండ్‌ ప్రచార కర్తగా నియమించాని పేర్కొన్నారు. దీనికి నటి నయనతార ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రచార వీడియోను ఆయన ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు