Nayanthara Next Movie: నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌

21 Sep, 2023 14:45 IST|Sakshi

సంచలన నటి నయనతార మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి మన్నాంగట్టి సిన్స్‌ 1960 అనే టైటిల్‌ నిర్ణయించారు. నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్‌, నరేంద్ర ప్రసాద్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్‌ పిక్చర్స్‌ ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ భారీఎత్తున నిర్మిస్తున్నారు.

(ఇదీ చదవండి: Manchu Lakshmi: నాకే అడ్డొస్తావా అంటూ ఒక్కటి ఇచ్చేసిన మంచులక్ష్మి!)

ఈ చిత్రం ద్వారా యూట్యూబ్‌ విక్కీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్డీ రాజశేఖర్‌ ఛాయాగ్రహణం, శ్యాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందిస్తున్న చిత్రం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాగా ఇది ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న 10వ చిత్రం అన్నది గమనార్హం. ఒక యూట్యూబర్‌కు దర్శకత్వం వహించే అవకాశాన్ని నయనతారా ఇవ్వడంతో ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారింది. విక్కీ కూడా ఇప్పటికే రెండు చిన్న సినిమాలను తెరకెక్కించాడు. అతనిలోని ప్రతిభను గుర్తించే నయనతారా అవకాశం ఇచ్చారని సమాచారం.

కొలమావు కోకిల వంటి విజయవంతమైన చిత్రం తరువాత నయనతార, యోగిబాబు కాంబినేషన్‌ రూపొందడంతో ఈ మన్నాంగట్టి సిన్స్‌ 1960 చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌పోస్టర్‌ను, మోహన్‌ పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేయగా అవి ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. చిత్ర షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు నిర్మాత తెలిపారు.

మరిన్ని వార్తలు