నల్లమల అడవిలో నాజర్‌ పరిశోధనలు!!

18 May, 2021 06:40 IST|Sakshi

అమిత్‌తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నల్లమల’. రవిచరణ్‌ దర్శకత్వంలో ఆర్‌.ఎమ్‌ నిర్మించారు. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన నాజర్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు.

రవిచరణ్‌ మాట్లాడుతూ– ‘‘ఇరాన్‌లో నివసించే తెలుగు శాస్త్రవేత్త పాత్రను నాజర్‌ చేశారు. తన పరిశోధనలు ప్రపంచాన్ని శాసించాలనుకునే శాస్త్రవేత్త. అందుకు ఏం తయారు చేయాలా అని ఆలోచిస్తుంటాడు. ఆ ప్రయోగం మంచిదా? చెడ్డదా? అనేది పట్టించుకోడు. ప్రయోగాలకు నల్లమల అడవిని ఎంచుకుంటాడు. ఆ ప్రయోగాల వల్ల ఏం జరిగిందనేది కథ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు