భార్యలతో మాలీవుడ్‌ స్టార్‌ హీరోలు.. ఫోటో వైరల్‌

25 Jun, 2021 21:28 IST|Sakshi

మలయాళ స్టార్‌ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు ఒకచోట చేరారు. గెట్‌ టు గెదర్‌ పార్టీలో భార్యలతో కలిసి దర్శనమిచ్చారు. ఈ  ఫోటోలను హీరోయిన్‌ నజ్రియా నజిమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. మలయాళ స్టార్‌ హీరోలంతా ఒకచోట చేరడంతో ఈ ఫోటో ప్రస్తుతం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ స్వీట్‌ మూమెంట్‌ని నజ్రియా మిర్రర్‌ సెల్ఫీలో బంధించారు. అయితే ఈ గెట్ టు గెదర్ లో అందరూ బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపించారు.

ఇక ‘ట్రాన్స్‌’లో చివరిసారిగా కనిపించిన నజ్రియా నాచురల్‌ స్టార్‌ నానితో అంటే సుందరానికి అనే చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటుంది. ఇక ‘కోల్డ్ కేస్’ విడుదల కోసం హీరో పృథ్వీరాజ్ సన్నద్ధమవుతుండగా, ‘కురూప్’, ‘సెల్యూట్’  చిత్రాల రిలీజ్‌ కోసం దుల్కర్‌ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఫహద్ ఫాసిల్ పుష్ప సినిమాలో విలన్‌ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. 

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

చదవండి : కమెడియన్‌ అలీ సినిమాకు ప్రభాస్‌ ప్రమోషన్స్‌
ఆ హీరోయిన్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందట!

మరిన్ని వార్తలు