నాని మూవీకి హ్యాండ్‌ ఇచ్చిన నజ్రీయా, షూటింగ్‌ వాయిదా!

27 Apr, 2021 14:33 IST|Sakshi

నటి నజ్రీయా నజీమ్‌.. టాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయనప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ మళయాల భామ ‘రాజారాణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక తెలుగులో తొలిసారిగా ఆమె నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. ఇందులో నజ్రీయా హీరో నానితో జతకట్టనుంది.

ప్రస్తుతం నాని ‘శ్యామ్ సింగ రాయ్‌’ సినిమా షూటింగుతో పాటు ‘అంటే .. సుందరానికీ!’ సినిమా షూటింగులో కూడా పాల్గొంటు ఫుల్‌ బిజీ అయిపోయాడు. అయితే నజ్రీయా భర్త ఫహద్ ఫాజిల్ ‘పుష్ప’ మూవీలో విలన్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు సినిమాల షూటింగ్‌ నేపథ్యంలో ఈ జంట ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలు సినిమాలు షూటింగ్‌లు వాయిదా పడినప్పటికి, కొన్ని సినిమాలు మాత్రం అతి తక్కువ సిబ్బందితో షూటింగ్‌లను జరుపుకుంటున్నాయి.

అయితే పుష్ప మూవీ కూడా వాయిదా పడటంతో నజ్రీయా భర్త ఫహద్‌ తిరిగి చెన్నై వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడట.  ‘అంటే.. సుందరానికీ’ సినిమా షూటింగ్‌ కోసం భర్తతో హైదరాబాద్‌ వచ్చిన నజ్రీయా తిరిగి భర్తతో వెళ్లిపోవడానికి రేడి అయ్యిందట. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకొని అంటే సుందరానికీ మూవీ షూటింగ్ చేయాలని భావించారట మేకర్స్. అయితే హీరోయిన్ నజ్రియా మాత్రం ఈ పరిస్థితుల్లో తాను షూటింగ్‌లో పాల్గొన్నానని తెగేసి చెప్పిందట. దీంతో నాని సహా 'అంటే సుందరానికీ' టీమ్ ప్యాకప్ చెప్పేసి కొన్నిరోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారని సమాచారం. కాగా ఇందులో నటి నదియా కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.

చదవండి: 
ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పుడూ ప్రత్యేకమే : హీరోయిన్‌
అంటే సుందరానికి...

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు