సూర్య కోసం సెన్సేషనల్‌ హీరోయిన్‌, విలన్‌ ఎంట్రీ

15 Sep, 2023 08:06 IST|Sakshi

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో 'సూర్య' ఇప్పుడు తన పాన్‌ ఇండియా చిత్రం 'కంగువ' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, ఇందులో అతను గిరిజన లెజెండ్‌గా నటిస్తున్నాడు. ఇదీ పూర్తి అయిన వెంటనే తన 43వ చిత్రం కోసం దర్శకురాలు సుధా కొంగర, స్వరకర్త జివి ప్రకాష్‌తో మళ్లీ జతకట్టనున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ ముగ్గురూ ఇప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా)లో కలిసి పనిచేశారు.

(ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్‌లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?)

'సూర్య 43' ప్రాజెక్ట్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ధృవీకరించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.  తాజాగా మరో ఆసక్తకరమైన వార్త ఒకటి వైరల్‌ అవుతుంది. ప్రముఖ నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా సూర్య 43 లో ఒక ప్రధాన పాత్రతో తమిళ సినిమాలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్‌లో ఇది సెన్సేషనల్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు.

ఆమె గతంలో తమిళ చిత్రసీమలో భారీ హిట్‌ సినిమాల్లో నటించి పలు విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్‌తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆమె తగ్గించారని చెప్పవచ్చు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమచారం.

అలాగే, సూర్య 43లో విలన్‌గా నటించడానికి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెండితెరపై ఆతని విలనిజం సరికొత్తగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  విజయ్ వర్మ డార్లింగ్స్ వంటి పలు చిత్రాలలో తన నటనతో విశ్వసనీయ నటుడిగా స్థిరపడ్డాడు, దహాద్, పింక్, గల్లీ బాయ్, సూపర్ 30, లస్ట్ స్టోరీస్ 2 వంటి చిత్రాలతో  ఆయనకు పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు ఉంది.

దీంతో దర్శకులు,నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. సుధా కొంగర ప్రస్తుతం అక్షయ్ కుమార్ కథానాయకుడిగా సూరరై పొట్రు హిందీ రీమేక్‌ని పూర్తి చేసే దశలో ఉంది. అది పూర్తి అయిన వెంటనే   సూర్య 43 ప్రాజెక్ట్‌ అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలలో సెట్స్‌పైకి వెళ్తుందని సమచారం.

మరిన్ని వార్తలు