3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?

29 Sep, 2020 19:05 IST|Sakshi

సంచలన విషయాలు వెల్లడించిన ఎన్‌సీబీ

బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఎనోఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి రంగంలోకి దిగుతున్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేసిన దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా రియా చక్రవర్తిని, క్వాన్ టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. క్వాన్, రియా అకౌంట్ల మధ్య జరిగిన భారీ నగదు లావాదేవీలు షాక్ గురిచేస్తున్నాయి. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా రెండు భారీ మొత్తాలు క్వాన్, రియా చక్రవర్తి అకౌంట్ల మధ్య ట్రాన్స్‌ఫర్‌ జరిగినట్లు తెలిసింది. ఆ వివరాలపై ఈడీ ఆరా తీయాలనుకొంటున్నది. కంపెనీ నుంచి రియా అకౌంట్‌లోకి భారీగా కమీషన్లు జమ అయ్యాయి. ఒకానొక సమయంలో కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే ఉన్న రియా అకౌంట్‌లోకి ఒక్కసారిగా లక్షలు బదిలీ కావడం పలు అనుమానాలను రేకిత్తిస్తోంది. రియా-ఆమె తల్లి సంధ్య పేరిట ఉన్న జాయింట్‌ అకౌంట్‌లోకి ఈ మొత్తం చేరినట్లు సమాచారం. (చదవండి: నలుగురిదీ ఒక్కటే మాట..)

ఈ క్రమంలో ఈడీ రియా, ఆమె తల్లి సంధ్య జాయింట్‌ అకౌంట్‌లో జరిగిన లావాదేవీలను పరిశీలించనుంది. ఇక రియా అకౌంట్‌లోకి వచ్చిన డబ్బు డ్రగ్‌ డీలర్లు ఇచ్చిన కమిషన్లే అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే సుశాంత్‌ చనిపోయిన నెల తర్వాత రియా అకౌంట్‌లో కొన్ని కమీషన్లు జమ అయినట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఇక డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ రియా చక్రవర్తి లాయర్ సతీష్ మాన్‌షిండే దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారించింది. అయితే దర్యాప్తు కొనసాగుతున్నందున రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఇతరులకు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రియా తరపు లాయర్‌ సుశాంత్‌ మొదటి నుంచీ మెంటల్‌ కేసే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రియాతో పరిచయానికి ముందు నుంచి అతనికి డ్రగ్స్‌ అలవాటు ఉందని తెలిపాడు. ఇక సుశాంత్‌ కోసం రియా డ్రగ్స్‌ కొనలేదని.. అతనికి డబ్బుకు కొదవలేదని తెలిపాడు. (చదవండి: ‘అత్యంత తీవ్రమైన నేరం’.. బెయిల్‌ వస్తుందా?)

డ్రగ్స్‌ అలవాటు లేని రియా వాటిని ఎందుకు కొనుగోలు చేసిందని ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించారు. రియా, ఆమె సోదరుడు డ్రగ్‌ సిండికేట్‌ మెంబర్స్‌ అని తెలిపారు. ఇక బాలీవుడ్‌ నటుల ఆర్థిక లావాదేవీలు తనిఖీ చేస్తున్న అధికారులు కొందరు నటులు డ్రగ్స్‌ కొనుగోలుకు క్రెడిట్‌ కార్డులు వాడినట్లు గుర్తించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు