Aryan Khan Drug's Case: షారుక్‌, అనన్య పాండే ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

21 Oct, 2021 13:36 IST|Sakshi

ఇటీవల బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు గురించి తెలిసిందే. ఈ కేసు విషయం తాజాగా షారుక్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే ఇళ్లలో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. 

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాట్‌లో ‘లైగర్‌’ భామ అనన్య పాండే కూడా ఉన్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇది ఇంకా కన్‌ఫామ్‌ కాకపోయినప్పటికీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు డ్రగ్స్ కేసు విషయమై ఈ బ్యూటీని విచారణకు పిలిచింది ఎన్‌సీబీ. రిపోర్టుల ప్రకారం, ఆ చాట్‌లో  ఈ భామతో పాటు, ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా ఖాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, అనన్య తాజాగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా చేస్తున్న ‘లైగర్‌’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన దాదాపు 19 రోజుల తర్వాత ఈ రోజే ఆర్థర్ రోడ్ జైలులో కుమారుడిని కలిశాడు బాద్‌ షా. ఆర్యన్ అరెస్ట్ తర్వాత షారుక్‌ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.

చదవండి: దివ్యభారతితో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నా: సీనియర్‌ నటి

మరిన్ని వార్తలు