డ్రగ్‌ కేసు; రకుల్ ప్రీత్‌ సింగ్‌కు ఎన్సీబీ సమన్లు

23 Sep, 2020 18:06 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటివరకు కేవలం బాలీవుడ్, శాండల్‌వుడ్‌కే పరిమితమైన ఈ కేసు ఇపుడు టాలీవుడ్‌ను సైతం వెంటాడుతోంది. ముంబై‌ డ్రగ్స్‌ కేసులో రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో సారా అలీఖాన్‌, దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌ వంటి బీటౌన్‌ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్‌లోనూ ప్రముఖ నటీమణుల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్‌ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, నమ్రత పేరు బయట పడటంతో సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాక టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రతా చాట్ చేసినట్టుగా జాతీయ మీడియాలో వచ్చింది. (డ్రగ్స్‌ వాడకం ఫలితమే డిప్రెషన్‌: కంగనా)

ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్‌ స్టార్స్‌ దిపికా, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) నోటీసులు జారీ చేసింది, మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌ అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. (టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు