Waltair Veerayya : 'వాల్తేరు వీరయ్య' నుంచి నీకేమో అందమెక్కువ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

11 Jan, 2023 16:01 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. డైరెక్టర్‌ బాబి తెరెకెక్కించిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ భారీ హైప్‌ను క్రియేట్‌ చేస్తోంది. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల మందుకు రాబోతుంది.

ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి 'నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువా' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్‌. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.మికా సింగ్, గీతామాధురి, డీ వెల్మురుగన్ ఈ పాటను పాడారు. 
 

మరిన్ని వార్తలు