పాచిపని అయినా చేద్దామనుకున్నా: నటి

13 Jun, 2021 17:41 IST|Sakshi

కూతురిని ప్రయోజకురాలిని చేసి సింగిల్‌ మదర్‌గా జీవించగలనని నిరూపించింది బాలీవుడ్‌ సీనియర్‌ నటి నీనా గుప్తా. అయితే ఇందుకు తన తల్లే కారణమంటోంది. స్వతంత్రంగా ఎలా బతకగలమనేది తల్లి నుంచే నేర్చుకున్నాననంటోంది. తనను పెంచి పెద్ద చేయడానికి పాచిపని చేసేందుకైనా సిద్ధపడ్డాను కానీ ఎవరినీ సాయం కోసం చేయి చాచి అడగలేదని చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో నీనా గుప్తా మాట్లాడుతూ.. 'నేను ఎవరి మీదా ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాను. అది డబ్బు విషయమే కావచ్చు, మరేదైనా కావచ్చు. పొట్టకూటి కోసం ఏ పని చేసినా అందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని నా తల్లి దగ్గర నేర్చుకున్నాను. ఇళ్లు ఊడ్వడం, అంట్లు తోమడం సహా ఎలాంటి పనులు అయినా చేస్తాను కానీ ఎవరి దగ్గరా పైసా అడగకూడదనుకున్నా. ఆఖరికి నా కుటుంబం, స్నేహితుల దగ్గర నుంచి కూడా ఎప్పుడూ ఆర్థిక సాయం కోరలేదు' అని చెప్పుకొచ్చింది.

నీనా కూతురు మసాబా గుప్తా ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. నీనా సినిమాల విషయానికి వస్తే.. అమితాబ్‌ బచ్చన్‌, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'గుడ్‌బై' సినిమాలో నటిస్తోంది. ఆమె చివరగా నటించిన 'సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌' మూవీ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

చదవండి: సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌ రివ్యూ: నానమ్మ కోరికను హీరో నెరవేరుస్తాడా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు