Neena Gupta: నా కూతుర్ని ఇండస్ట్రీలో అడుగుపెట్టనివ్వలేదు!

30 Jul, 2022 17:41 IST|Sakshi

మసాబా గుప్తా.. ఫ్యాషన్‌ డిజైనర్‌గా రాణిస్తున్న ఈమె మసాబా మసాబా, మోడర్న్‌ లవ్‌ ముంబై అనే వెబ్‌ సిరీస్‌లలో నటించింది. తల్లి నీనా గుప్తా బాలీవుడ్‌లో పేరు మోసిన నటి. తండ్రి రిచర్డ్స్‌ వెస్టిండీస్‌.. వీరికి గుర్తుగా జన్మించిన కూతురే మసాబా. అయితే రిచర్డ్‌ తనను పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పడంతో సింగిల్‌ పేరెంట్‌గానే మసాబాను పెంచి పెద్ద చేసింది నీనా. కానీ మసాబాను సినిమాల్లోకి రానివ్వలేదని అందుకు క్షమాపణలు కోరుతున్నానంటూ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'మసాబా మసాబా మొదటి సీజన్‌ చూసినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోయా. నిజానికి మసాబాను నేను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేదాన్ని, అందువల్ల ఆమె బాధపడేది కూడా! కానీ తల్లిగా నేను చేయాల్సింది అదే.. కానీ ఆ సిరీస్‌ చూశాక ఆమె టాలెంట్‌కు అబ్బురపడ్డా. మొదట్లో తనను సినిమాల్లోకి రానివ్వలేదు.. అందుకు క్షమించమని కోరుతున్నా. నటిగా తనేంటో నిరూపించుకునే సత్తా ఆమెకుంది.

తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్‌ సిస్టమ్‌లా ఉండాలి. వారి సమస్యలను పేరెంట్స్‌ దగ్గర చెప్పుకునేలా ఉండాలి. ఇప్పుడు మసాబా నాతో మాట్లాడినట్లుగా నేను మా అమ్మతో మాట్లాడలేదు. పరిస్థితులు మారుతున్నాయి. కానీ చిన్నకుటుంబంలో మన సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. అవి మనలోనే నలిగిపోయి కొన్నిసార్లు భయానక పరిస్థితులను సృష్టిస్తాయి' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా. కాగా మసాబా మసాబా సిరీస్‌ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

చదవండి: దుస్తులు లేకుండా రణ్‌వీర్‌.. ‍అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ
కిడ్నీ ఫెయిలై మహాభారత్‌ నటుడు మృతి

మరిన్ని వార్తలు