Lust Stories 2 Teaser: కారు కొనడానికేమో టెస్ట్ డ్రైవ్.. మరీ పెళ్లికి ముందు వద్దా?.. ఆసక్తిగా టీజర్

6 Jun, 2023 16:37 IST|Sakshi

నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఈ మూవీకి అమిత్ రవీందర్నాథ్ శర్మ, కొంకణ సెన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

(ఇది చదవండి: చిన్న సూట్‌కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి)

ఈ చిత్రంలో సీనియర్ నటి నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటించారు. టీజర్‌ ప్రారంభంలో నీనా గుప్తా మాటలు టీజర్‌పై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఒక కారు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం.. మరీ పెళ్లికి ముందు ఇలాగే చేయకూడదా అని అడిగింది. నీనా మాటలకు కాజోల్ నవ్వుతూ కనిపించింది.

కాగా.. ఈ చిత్రంలో అంగద్‌కు జోడీగా మృణాల్, విజయ్ వర్మకు జంటగా తమన్నా నటిస్తున్నారు. ఈ టీజర్‌లో విజయ్, తమన్నా కూడా రొమాంటిక్‌గా కనిపించారు. కాగా.. విశాల్ భరద్వాజ్ వెబ్ సిరీస్ చార్లీ చోప్రా & ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీలో కూడా నీనా నటిస్తున్నారు. కాజోల్ కూడా ది గుడ్ వైఫ్‌ వెబ్‌ సిరీస్‌లో కనిపించనుంది.

(ఇది చదవండి: లలితా జ్యువెలరీలో దోపిడి, చివరకు ఎయిడ్స్‌తో.. ఆ దొంగ కథే జపాన్‌?)

మరిన్ని వార్తలు